Sports News

సిరీస్‌ గెలిచి అమరజవాన్లకు అంకితమిస్తాం..!

మరో నాలుగు రోజుల్లో టీమిండియా-ఆసీస్‌ మధ్య టీ20 సిరీస్‌ పోరు మొదలు కాబోతోంది. ఇందుకోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇరుజట్ల మధ్య ఇటీవల ఆసీస్‌ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌, వన్డేలను టీమిండియా చేజిక్కించుకుంది. టీ20 సిరీస్ మాత్రం డ్రాగా ముగిసింది. దీంతో స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌ను దక్కించుకోవడంపై టీమిండియా దృష్టి సారించింది. మరో వైపు సొంతగడ్డపై ఎదురైన పరాభావాన్ని ఈ పర్యటనలో తీర్చుకుని లెక్క సరిచేయాలని కంగారూ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్‌ మహమ్మద్‌ షమీ మీడియాతో మాట్లాడాడు.గెలవడానికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నాడు.

‘సొంతగడ్డపై టీ20 సిరీస్‌ గెలవాలని టీమిండియా నిబద్ధతతో సాధన చేస్తోంది. గెలవడానికి ఎలా కష్టపడాలో అలా కష్టపడతాం. సొంతగడ్డపై టీ20 సిరీస్‌ గెలిచి అమరజవాన్లకు అంకితమిస్తాం. పుల్వామా ఘటన ఎంతో బాధించింది. ఇదో భయంకర ఘటన. భారత ప్రజల్ని కాపాడటానికి జవాన్లు వారి జీవితాలను ప్రమాదంలో పెట్టుకుంటున్నారు. మనం ఇలా ఉన్నామంటే 24×7వారు కష్టపడం వల్లే. కాబట్టి వారికి మేం ఈ రకంగా నివాళి ఇవ్వాలనుకుంటున్నాం’ అని తెలిపాడు.

ఐదు రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడికి బలైన వారి కుటుంబాలకు షమీ ఆర్థిక సాయం చేశాడు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల భార్యల సంక్షేమ సంఘానికి షమీ రూ.5లక్షలు విరాళంగా ఇచ్చాడు. షమీతో పాటు శిఖర్‌ ధావన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here