Political News

ఒకేసారి ఏపీ, తెలంగాణ లో ఎన్నికలు..!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే శాసన సభ ఎన్నికలు పూర్తి కాగా లోక్ సభ ఎన్నికలకు సిద్ధం అవుతుంది.. ఇక ఏపీ లో మాత్రం ఇంకా శాసన సభ ఎన్నికలు జరగలేదు. మరో రెండు నెలల్లో అవి జరగనున్నాయి. అయితే అంతకంటే ముందే లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నట్లు తెలుస్తుంది. ఒక్క ఏపీ లోనే కాదు రెండు తెలుగురాష్ట్రాల్లో ఏకకాలం లో ఈ లోక్ సభ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు సమాచారం.

రెండు రాష్ట్రాల్లో కూడా చాలామందికి ఓటు హక్కు ఉంది. దీంతో ద్వంద్వ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు లోక్‌సభ ఎన్నికల్ని ఏపీ, తెలంగాణలో ఒకేసారి జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వచ్చేనెల మొదటివారంలోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలను 5 నుంచి 7 విడతలుగా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. తెలంగాణ విషయాన్నీ పక్కన పెడితే ఏపీ కి ఈ ఎన్నికలు మరింత ముఖ్యం కానున్నాయి. ఇప్పటికే శాసన సభ ఎన్నికల కోసం భారీ గా అన్ని పార్టీలు కసరత్తులు చేస్తుంటే..ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు కూడా అంటే వారికీ కత్తిమీద సామే.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here