News

పుల్వామా దాడి భయానకం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పుల్వామా ఉగ్రదాడిపై స్పందించారు. దాడిపై మాకు నివేదికలు అందాయి. దాడిని భయానక చర్యగా అభివర్ణించారు. నేను వాటిని పరిశీలించాను అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం. రెండు దేశాలు (పాకిస్థాన్‌, ఇండియా) కలిసి నడిస్తే బాగుంటుంది అని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. దాడులపై భారత్‌తో చర్చించామన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ దాడిపై విచారణకు పాకిస్థాన్‌ పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంతోనూ చర్చలు జరిపామన్నారు. వైట్‌హౌస్‌లోని ఇతర విభాగాలు సైతం దాడిని తీవ్రంగా ఖండించాయి.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here