News

పాకిస్థాన్‌లు 48గంటలోగా నగరాన్ని విడిచి వెళ్లాలి..!

గత గురువారం పుల్వామాలోని సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ పై పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లా కలెక్టర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ జిల్లాలోని పాకిస్థానీలు 48 గంటల్లోనే నగరాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని హోటళ్లు, లాడ్జిల్లో పాకిస్థానీలను అనుమతించొద్దని ఆదేశించారు. పాక్‌ దేశస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, వారితో ప్రత్యక్ష లేదా పరోక్ష వ్యాపార సంబంధాలు పెట్టుకోరాదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న సిమ్‌ కార్డులను కూడా వినియోగించకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెండు నెలల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని జిల్లా యంత్రాంగం తెలిపింది.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here