Entertainment

తగ్గించుకునే పనిలో బన్నీ..!

నా పేరు సూర్య తర్వాత చాల గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్..ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని మార్చి నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ముందుగా ప్లాన్ చేసారు. కానీ ప్రస్తుతం ఇంకొన్ని రోజులు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. దీనికి కారణం అల్లు అర్జున్ బరువు. అవును దాదాపు ఏడాది గా ఖాళీగా ఉన్న బన్నీ..విపరీతంగా బరువు పెరగాడట. అది తగ్గడానికి కొన్ని రోజులు గడవు అడిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జిమ్ లో తగ్గే పనిలో బిజీ గా ఉన్నాడట.

ఈ చిత్రంలో బన్నీ సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. గతంలో వీరిద్దరి కలయికలో డీజే చిత్రం వచ్చింది. అరవింద సమేత తర్వాత మళ్లీ త్రివిక్రమ్ తో ధమన్ పనిచేస్తున్నాడు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here