News

జవాన్ల కుటుంబాలకు బిసిసిఐ రూ.5కోట్ల సాయం..!

పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల కుటుంబా లను ఆదుకునేందుకు రూ.5కోట్లు కేటాయించాలని బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా ఆదివారం ప్రతిపాదించారు. అలాగే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, ఇండియా-ఆసీస్‌ మధ్య జరగబోయే టీ20 సిరీస్‌, ఇండియన్‌ ప్రీమియర్‌ ఈగ్‌-2019 మ్యాచ్‌ల ముందు 2నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రతిపాదించారు. పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్ల కుటుం బాలకు తమకు తోచినంత సహాయం చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లకు,ఐపిఎల్‌ ఫ్రాంచైజీలకు ఖన్నా విజ్ఞప్తి చేశారు. గురువారం శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై సిఆర్‌పిఎఫ్‌ కాన్వా§్‌ు వెళ్తుండా ఉగ్రవాడి కారుతో ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడటంతో 40మంది జవాన్లు మృతిచెందారు. పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు. 2500మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు 78బస్సుల్లో శ్రీనగర్‌ బయిలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here