Gossips

బోయపాటికి షాక్ ఇచ్చిన బాలయ్య..!

బాలయ్య తో బోయపాటి మూడో సినిమా రాబోతుందనే సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ మూవీ ప్రకటన కూడా జరిగిపోయింది..మరికొన్ని రోజుల్లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్న బోయపాటికి షాక్ ఇచ్చాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ సినిమాను జూన్ తర్వాత మొదలు పెడతామని బాలయ్య చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి కారణం మహానాయకుడు చిత్రం తో పాటు ఏపీ లో జరగపబోయే ఎన్నికలే అని తెలుస్తుంది.

బాలకృష్ణ నిర్మాణం లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి పార్ట్ వచ్చి ప్లాప్ అవడం తో షాక్ లో పడ్డ బాలయ్య , రెండో పార్ట్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రీసెంట్ గా షూటింగ్ అంత పూర్తి చేసిన బాలయ్య , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా విడుదల తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ కావాలని చూస్తున్నాడు. ఏప్రిల్ నెలలో జరగబోయే ఎన్నికల తర్వాత తన కొత్త సినిమాను మొదలు పెట్టాలని అప్పటి వరకు కొత్త సినిమా జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యినట్లు సమాచారం.

మరోపక్క వినయ విధేయ రామ చిత్ర ప్లాప్ తో బోయపాటి తో గతంలో సినిమాలు చేయాలనుకున్న వారంత వెనకడుగు వేస్తున్నారు. ఇచ్చిన అడ్వాన్స్ లను సైతం వెనక్కు అడుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద బోయపాటి కి దారుణమైన బ్యాడ్ టైం నడుస్తుందని అర్ధమవుతుంది.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here