Gossips

బోయపాటిని బ్యాన్ చేసారా…!!

టాలీవుడ్లో బోయపాటి శ్రీను ఓ బిగ్ డైరెక్టర్. ఆయన మాస్ మూవీస్ చాలా బాగా తీస్తారని పేరు. ఆయన తీసిన మూవీస్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి కూడా. దాదాపు పదిహేనేళ్ళుగా శ్రీను టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

అటువంటి బోయపాటి శ్రీనుని బ్యాన్ చేస్తున్నారన్న న్యూస్ ఇపుడు వైరల్ అవుతోంది. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామా మూవీ ఫ్లాప్ కావడంతో బోయపాటికి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. ఆ మూవీ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలు చివరికి బోయపాటికి మెగా క్యాంప్ కి దూరం చేశారని టాక్ నడుతోంది. ఈ మొవీకి భారీగా నష్టం రావడంతో బయ్యర్లను ఆదుకునేందుకు నిర్మాత దానయ్య, హీరో రామ్ చరణ్ ముందుకు వచ్చారని బోయపాటిని కూడా కలసి రమ్మని కోరారని ఈ సందర్భంలోనే విభేదాలు వచ్చాయని అంటున్నారు.

ఏది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ఈ మూవీ ఫ్లాప్నకు బాధ్యుడిగా బోయపాటినే చేస్తున్నారట. ఆయన చెప్పినా వినకుండా లావిష్ గా మూవీ కోసం ఎక్కువ ఖర్చు చేయించాడని కూడా ఆరోపణలు చేస్తున్నారని టాక్. అలాగే మూవీలో అనవసర సీన్ల వల్ల లాగింగ్ ఎక్కువైందని చెప్పినా వినకుండా రిలీజ్ చేయడం వల్లనే రిజల్ట్ తేడా కొట్టిందని అంటున్నారు. మొత్తానికి వినయ విధేయ రామ మూవీతో బోయపాటికి మెగా కాంపౌండ్ దూరం పెడుతోందని అంటున్నారు. దాంతో చిరంజీవి, అల్లు అర్జున్లతో బోయపాటి చేయాల్సిన మూవీస్ కూడా ఇప్పట్లో లేవనే అంటున్నారు. చూడాలి మరి.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here