Movie News

‘మజిలీ’ శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా..?

యుద్ధం శరణం , శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి ఇలా మూడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ప్లాపులై అభిమానులను , నాగ చైతన్య ను తీవ్రంగా నిరాశ పరిచింది. అయినాగానీ చైతు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు అనేదానికి ఉదాహరణ మజిలీ శాటిలైట్ రైట్స్.. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణి డైరెక్షన్లో సమంత తో కలిసి చైతు నటిస్తున్న చిత్రం మజిలీ. వైజాగ్ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది..ఈ నేపథ్యంలో ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందట. ఈ భారీ క్రేజ్ మధ్య జీ తెలుగు వారు 6 కోట్ల కు ఈ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఎంత భారీ మొత్తం పెట్టడానికి కారణం సమంత , నాగ చైతన్య లు కలిసి చేయడమే..పెళ్లి తర్వాత మొదటిసారి వీరిద్దరి కాంబో లో వస్తుండడం , శివ డైరెక్ట్ చేయడం తో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాతోనే ఈ భారీ మొత్తం పెట్టినట్లు తెలుస్తుంది.

రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహు గరపాటి, హరీష్ రెద్ది మజిలీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here