Latest NewsNews

కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్

సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్‌పై 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం 2 కేసులు ఉన్నట్లు మాత్రమే చూపారని పిటిషనర్ పేర్కొన్నారు. కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.

మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుపై కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికారులకు తెలియకుండా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారని ప్రేమ్ సాగర్ పిటిషన్ వేశారు. దివాకర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆయన పిటీషన్‌లో కోరారు. పోలింగ్ శాతంలోనూ తేడాలున్నాయని పేర్కొన్నారు. పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించనుంది.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here