Gossips

రజనీ సినిమా తెలుగులో రావట్లేదా..?

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేవలం తమిళం లోనే కాదు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన నుండి ఏ సినిమా వచ్చిన అన్ని భాషల్లో విడుదలై, అభిమానులను ఆకట్టుకుంటుంది. ముఖ్యం గా తెలుగు లో అయితే చెప్పాల్సిన పనే లేదు. తమిళనాట ఎలాంటి క్రేజ్ ఉంటుందో అంతకు రెట్టింపు గా ఇక్కడ క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు రజనీ నటించిన ప్రతి సినిమా తెలుగు లో డబ్ అవుతూ వస్తున్నాయి.

త్వరలో రజనీ నుండి వస్తున్న సినిమా మాత్రం తెలుగు లో రావట్లేదని తెలుస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ – రజనీ కలయికలో తెరకెక్కిన పెట్ట చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే తమిళంలో చిత్ర ప్రమోషన్ మొదలు పెట్టుకోగా , తెలుగు లో మాత్రం ఇంత వరకు ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. అంతే కాదు కనీసం పోస్టర్ ను సైతం విడుదల చేయకపోయేసరికి ఈ సినిమా తెలుగు లో విడుదల కావడం లేదని అంత మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే పెట్ట ను తెలుగు లో విడుదల చేయడం లేదా..దీని ఫై త్వరగా చిత్ర మేకర్స్ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ వేస్తున్నారు.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here